పుట:SamskrutaNayamulu.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
130

సంస్కృతన్యాయములు

కౌశికోలూక.....' అని నిఘంట్వుద్వారా గ్రుడ్లగూబను గ్రహించి గ్రుడ్లగూడ ఇట్లనెను అనిగాని; "కౌశిక; కాకాన్ సంహరతి" గ్రుడ్లగూబ కాకులను చంపుచున్నది అనినపుడు 'కుశికస్యాపత్యం పుమాన్ కౌశిక:" అను వ్యుత్పత్తిచే కౌశికుడు అన విశ్వామిత్రుడు కాకులను చంపుచున్నాడు అని గాని అర్ధములు నుడువు టసంగతము.

వ్యపగతలేపాలాజాన్యాయము

సొరకాయబుఱ్ఱను మట్తితో నింపి నీటిలో బడవైచిన నది మునుగును. నీరు తగిలి మట్తి అంతయు నీటిలో కఱగి పోయిన తేలికయై వెంటనే నీటిపైకి వచ్చును.

దేహముతో సంబంద మున్నంతవరకు ఆత్మ సంసార సముద్రములో మునిగియుండును. ఆయువు క్షేణించి దేహము నశించినవెను వెంటన ఆత్మ అచట నిలువక ఎకాయకి ఊర్ధ్వముఖముగ ఆకాశమున కెగిరిపోవును.

పంజరముక్తపక్షిన్యాయమును, జలతుంబిన్యాయమును, ఏరండబీన్యాయమును జూడుము.

వ్యపదేశిన్యాయము

ఒకేవస్తువునందు రెండు ధర్మములను ఆలోపించుట.

సమస్తబ్రహ్మాండాంతర్వర్తియవు పరమాత్మ యెకదే జీవుడు, దేవుడును.

అట్లే--- అత్రికి దత్తాత్రేయు దొకడే కుమారుడు. అతడే జ్యేష్ఠుడును.