పుట:SamskrutaNayamulu.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
126

సంస్కృతన్యాయములు

వృశ్చికవిదూషకన్యాయము

హాస్యగానికి తేలుకుట్టినచో వాడు బాధపడుచున్నను అదియును హాస్యమే యనుకొందురు.

ఈదుదునని నీటిలో దిగి ఈదలేక మునుగుచు, తేలుచు, చావ సింసిద్ధ మగుచున్నను వానిం జూచి గట్టుననున్న వారు యీత అనుకొనునటు.

వృశ్చికీదర్బన్యాయము

తేలు చూడి మోసి పిల్లలు పుట్తినవెంటనే చచ్చును. ఆత్మజ్ఞానము కలిగినంతన మాయావరణము విక్షి స్పమవును. అశ్వతరీగర్భన్యాయము జూడుము.

వృక్షప్రకంపన్యాయము

మొద లటు నిటు నూచిన చెట్టంతయు కదలినట్లు.

కొందఱు చెట్టుక్రిందనిలబడి తమలో నొకనిని చెట్టెక్కుమనిది. వాడట్లేచేసను. ఒక డొకొమ్మకదల్చుమనను. మఱొక డింకొకకొమ్మ కదల్చుమనెను. వేఱొకడు వేఱొకకొమ్మను, తదితరుడు తదితరశాంఅను; అన్యు డన్యవిటపమును గదల్చుమనిరి. వాడట్లే వరుసన అన్ని కొమ్మలను గదుల్చుచువచ్చెను. ఏకొమ్మ కదల్చిన నదియే కదలెడిదికాని చెట్తంతయు నొకమాఱుగ కదలలేదు. మొదట తా మనుకొనినట్లు చెట్టంతయు నొకమాటు కదలింప జాలక వారు తమలో తాము కళవళపడుచుండిరి. త్రోవన బోవుచున్న తెరువరి యొక డదంతయు నెఱిగి