పుట:SamskrutaNayamulu.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
125

సంస్కృతన్యాయములు

వివాహము, అందును తనభర్తకు రాజైశ్వర్యము, సంతాన ప్రాప్తి, పరమాయువు మున్నగు బహులాభములు ఒకే వరముచే నామె సంపాదించుకొన దలచి యిట్టి వరము వేడి కృతార్ధురాలయ్యెను.

కావున-- ఒకేవాక్యముచే ననేకాశయములు స్పురించుతావుల నీన్యాయము ప్రవర్తించును.

దీనికి వృద్ధకుమారీన్యాయము వృద్ధకుమారీవాక్యన్యాయము, వృద్ధకన్యావరన్యాయము అనియు బేర్లు.

వృద్ధబ్రాహ్మణవరన్యాయము

సైన్యాయమట్లె.

వృద్ధతరుణీన్యాయము

"వృద్ధస్య తరుణీ విషమ్".

వృద్ధవేశ్యాన్యాయము

"వృద్ధవేశ్యా తపస్వినీ" యనునట్లు.

వృశ్చికచీరన్యాయము

దొంగను తేలు కుట్తినట్లు.

కళా. 2. 76.

వృశ్చికవానరన్యాయము

అసలేకోతి, అందుపై తేలుకుట్టినది.

వైజ. 3. 105

మర్కటమదిరాపానాది న్యాయమును జూడుము.