పుట:SamskrutaNayamulu.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
117

సంస్కృతన్యాయములు

అట్లే--"కౌరవులు, పాండవులు సమానబలము గలవారలే కాని, పాండవులకు శ్రీకృష్ణునిసాయము గలదు." అనిన, శ్రీకృష్ణుడు సాయపడుటవలన బాండవులకంటె కౌరవులు బలహీనులైరని తెలియవచ్చుదున్నరి.

ఉద్దిష్టవిషయములందు చెప్పకయే పదవాక్యబలమున న్యూనాధిక్యములను స్పురిమపజేయుతావుల నీవ్యాయముపయోగింపబడును.

వినిగమనన్యాయము

ఒకవస్తువును రెండువిధముల సాధింప నవకాశ్మున్నను నీవిధమైన వైరుధ్య మన్నతికి కలుగకుండుటకై ఒకేరకమున సాధించవలను నియమమునకు వినిగమన మనిపేరు.

జ్యోతిగ్గణితమును సూర్యసిద్ధాంతము ప్రకారమునను దృగ్గణితమును సూర్యసిద్ధాంతము ప్రకారమునను దృగ్గణితపద్దతిని చేయవీలున్నను నిరుమతములవారు పోను పోను వైరుధ్యము కలుగక పరిణామ మొకటియే యగుట కొకే త్రోవ ననుసదింపవలయునని వ్యవస్థచేసినట్లు.

సూర్యసిద్ధాంతమునకును, దృగాణితమునకును గ్రహస్థితులలో కొన్నిభాగలు తేడా వచ్చుచునేయుండును. ఆతేడా లేకుండుటకై పైవ్యవస్థ. ఇట్లే తక్కినపట్లగూడ నెఱుంగునది