పుట:SamskrutaNayamulu.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
112

సంస్కృతన్యాయములు

స్వార్ధబుద్ధితో గర్మములు ప్రవర్తించుపట్ల నీన్యాయముపయోగింపబడును.

కొంద ఱస్వార్ధక్రియాలాపమునకే ఈన్యాయము చెల్లునందురు.

వలీముఖనారికేళన్యాయము

కోతికి కొబ్బరికాయ దొఱికినట్లు

నడివయసుగ్ల యొయారి రసికున కాలైన రాణించుంగాని మూర్ఝుని జేపట్టిన--

"........ రాజనిష్కటాభ్యంతరనారికేళఫల మబ్బినవానరు డేమె చేసెడున్?"

కొక్కోకము

వస్తుశ క్తిన్యాయము

వస్తువుయొక్క బలాబలములు దానిశాక్తి ననుసరించి ఏత్పడును.

క్రియమాణములవు కార్యములయొక్క ఫలాఫలములు ఆక్రియల మంచిచెడ్డలనుబట్టి కలుగును.

వహ్నిన్యాయము

ఒకవహ్నియే అనేకరకముల పనులు చేసినట్లు,

ఓకప్పు డది వంట చేసిమొనుట కుపయోగించును;

ఒకపు వెలుతురు నిచ్చును; ఒకపుడు పురగ్రామాదులను దహించును.

---భామతి న్యాయమును జూడుము.