పుట:SamskrutaNayamulu.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
111

సంస్కృతన్యాయములు

వలన వ్యస్తముగ నొకొక యింద్రియమునకు జేతత్వమును, అహంప్రత్యయవిషయత్వమును కలుగుననియెంచి తత్సంఘాతత్మత్వమును మఱికొందఱు వరసింతురు. మఱి కొందఱు మఱొకరకమున, తుదకు వారంద ఱొకనిశ్చయమునకు వచ్చినగదా ఆత్మస్వరూపనిర్ధారణము !

అట్టిపట్టుల నీన్యాయ ముపయుక్తము.

వర్చోన్యాయము

అగ్ని"హోత్రుని జయము నిమ్మని కోరినట్లు "మమాగ్నే వర్చో విహవే ష్వస్తు"

జైమిని (కరణాధికరణమంత్రము}

అనుచో--మం విహల్వేషు వర్చ: అస్తు అనునస్వయమున "నాకు విహములయందు జయము అగుగాక్" అనియు; "నాయొక్క విహములయందు జయము అగుగాక" అనియు రెందువిధముల నర్ధము సిద్దించుచున్నది. మొదటి పక్షమున జయము హూమకర్తకును, రెందవపక్షమున యదుద్దిష్టమై ఆహూమాదికములు ప్రవృత్తములయ్యెనో వనికిని చెందుచున్నది. అట్టియెడ నేయర్ధ మనుసరణీయము అని శంక వ్రెడముచున్నది.

'కరణాధికరణప్రపఠితమంత్రములకు గర్తౄద్దేశమే కాని యన్యోద్దేశము కాదను నిర్ధారణమున గర్తకే ఆజయము చెందవవలెనని పైశంక వారింపబడుచున్నరి. ఏతావాతా కర్మకాండకు యజమానుడే ఆయాఫలముల ననుభవింపవలయు ననునుద్దేశము రూఢమగుచున్నది. కావున---