పుట:SamskrutaNayamulu.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
103

సంస్కృతన్యాయములు

లోష్టప్రస్తారన్యాయము

(ప్రస్తారశబ్దము ప్రస్తరశబ్దరూపాంతరము. కావున శిలార్థకము.)

(స్వాభావికముగ) గట్టిదే యైనను మంటిబెడ్డ శిలకంటె మెత్తనిదే.

అశ్మలోష్టన్యాయమును జాడుము.

చిన్న చిన్నమంటిబెడ్డలు చేరి సంఘాతమై యొక శిలగా తయారగును.

చిన్న చిన్న కాలువలు కలిసి పెద్ద యేఱుగా ప్రవహించినట్లు.

రథ్యాప్రవాహన్యాయమును జూడుము.

(లోష్ట మనఁగా బిందువు. ప్రస్తారమనఁగా ఒక చోఁ గలిపి విస్తరింపఁజేసిన పట్టిక [Table])

ఒకబిందువును మధ్యనునిచి తత్పరికరముచే ఖండమేరు, మేరు, నష్టోద్దిష్టాది విధానముల ప్రస్తారము చేసినట్లు.

ఉదా:- గణప్రస్తారము, స్వరప్రస్తారము, శ్రీచక్రప్రస్తారము మున్నగునవి.

కుమ్మరి మట్టితో అనేకపాత్రలను దయారు చేసినట్లు ఈశ్వరుఁడును తనప్రపంచములో ప్రకృతిని అనేకరూపములఁ జిత్రించుచుండును.