పుట:SamskrutaNayamulu.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
102

సంస్కృతన్యాయములు

"కృతేఽపి కేశసంస్కారే భార్యత్వం నైవ ముంచతి"

ఇష్టము లేక తల గొఱిగించుకొనినను ఫలానా ఆయన భార్య అను మాట పోలేదఁట.

లాంగూలతరణన్యాయము

కుక్కతోఁక పట్టుకొని గోదావరి నీఁదినట్లు.

"కుక్కతోఁక పట్టి గోదావరీఁదునా" (వేమన.)

తెప్పతో సముద్రముదాఁట ప్రయత్నించినట్లు.

లాక్షారపావసిక్తకార్పాసబీజన్యాయము

ఎఱ్ఱరంగులో నానవేసి నాటిన ప్రత్తిగింజలనుండి ఎఱ్ఱని ప్రత్తి పుట్టును.

కర్మానుసారముగ శుభాశుభఫలములు కలుగును.

లూతాతంతున్యాయము

సాలెపురుగు తననోటినుండి తానే దారమును పుట్టించి ఆదారమును మఱల తనపొట్టలో నింపుకొనుంచుండును.

పరమాత్మ స్వేచ్ఛచే ప్రపంచములను తనంతన తా సృజించి ప్రళయావసరమున తనలో లీనము చేసికొనును.

        
"మహ త్సూత్రం తూర్ణనాభి ర్యథాఽఽస్యా
త్సమస్తం సృష్టాత్మమాయాసహాయ
స్వకుక్ష్యన్తర్లీన మేత త్కరోతి
పరం ధామైశం య దీడ్యం త దీడే."
          వ్యాఖ్యాతల రామలింగేశ్వర స్తవమునుండి.