పుట:SamskrutaNayamulu.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
93

సంస్కృతన్యాయములు

ముఖ్యార్థము. గౌణముఅనఁగా వ్యుత్పత్తిసిద్ధము; ముఖ్యము అనఁగా రూఢము. అట్టియెడ ఆధానప్రకరణమున వర్ష ఋతువునందు రథాకారున కాధానము కావింపఁబడవలయు నని చెప్పఁబడినది.

ఇందుఁ బ్రకరణగృహీత రథకారశబ్దమునకు సంకీర్ణజాతిజనితుఁడవు రథకారుఁడా, లేక రథములు చేయునాతఁడా వాచ్యుఁడు అను శంక వొడమ-

"అవయవసిద్ధేః సముదాయసిద్ధి ర్బలీయసీ"

అవయవసిద్ధార్థముకంటె సముదాయసిద్ధార్థము అనఁగా రూఢార్థము బలవత్తరము అను పరిభాషచే పంకజమునకు అవయవసిద్ధములవు బురదలో పుట్టిన నత్త మున్నగునవి నిరాకృతములై పద్మము అను ముఖ్యార్థమే స్వీకరింపఁబడుచున్నటుల గౌణార్థము నిరాకృతమై ముఖ్యమవు సంకీర్ణజాతివాచక రథకారుఁడే గ్రహింపఁబడవలయునని యాచార్యులచే సిద్ధాంతీకరింపఁబడినది.

ఏతావతా గౌణార్థమును వదలి ముఖ్యార్థమును బోధించు పట్ల నీ న్యాయము ప్రవర్తించును అని సారాంశము.

దీనికి 'రథకారాధికరణన్యాయము ' అనియు బేరు.

రథబడబాన్యాయము

రథమును లాగు గుఱ్ఱములవలె.