పుట:SamskrutaNayamulu.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
92

సంస్కృతన్యాయములు

రజ్జుసర్పన్యాయము

త్రాఁడు చూచి పాము అనుకొనినట్లు.

రథకారన్యాయము

'రథకారుఁడు' అనిన వ్యుత్పత్తిసిద్ధమవు రథము చేయువాఁడు అని అర్థము. దీనికే 'రథకారాధికరణన్యాయము' అనియుఁ బేరు.

"ఆధానే శ్రూయతే, వర్షాసు రథకార ఆదధీతేతి! తత్రరథం కరోతీతి వ్యుత్పత్త్యా త్రైవర్ణికో రథకార ఇతిచేత్‌| "

'రథం కరోతీతి రథకారః' అను వ్యుత్పత్తిచే రథకారశబ్దమునకు రథము చేయువాఁడు అని అర్థం.