పుట:SamskrutaNayamulu.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
91

సంస్కృతన్యాయములు

యూకాభియా కంథానాశ్రయణన్యాయము

నల్లులు కుట్టునని బొంతపైఁ బరుండ మానినట్లు.

భిక్షుభియాస్థాల్యనధిశ్రయణ, మృగభియాసస్యానాశ్రయణ న్యాయముల తెఱఁగున.

యూపపశున్యాయము

యూపస్తంభమునకు గట్టిన పశువునకుఁ జావు సిద్ధము.

కొలఁదికాలములోఁ దనకుఁ జావు సంసిద్ధమై యున్నను యూపబద్ధపశువు తద్విచారముమాట యటుండ మృతి జ్ఞానమే లేక నిర్వికారముగఁ దొంటి కట్టుకొయ్యన యున్నట్లె యుండును.

సత్పురుషులవు వారు సుఖదుఃఖములయందును, మానావమానములయందును నించుకేనియు వికారము నొందరు. వారి కావిచారమే తవులదు.

యూపరశనాన్యాయము

యూపస్తంభమునకు రెండు త్రాఁడులు కట్టియుంచునట్లు.

రండావివాహన్యాయము

లంజెకు పెళ్ళి గిట్టనట్లు.

రక్తపటన్యాయము

రంగుచీర కట్టుకొనుటచేతనే ముత్తయిదువు అని తెలియవచ్చినట్లు.

చెప్పనక్కరలేకయే లక్షణాదులం బట్టి వాస్తవికస్థితి తెలియవచ్చుట.