పుట:SamskrutaNayamulu.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
90

సంస్కృతన్యాయములు


యువశబ్దమునకు యవధాన్యములు, బార్లీగింజలు, గొలుగు చెట్టు మున్నగు నర్ధములు గలవు. అట్లే వరాహశబ్దమునకును పంది, కృష్ణవిహంగాదు లర్ధములు. కాని వీనికి శాస్త్రసిద్ధము లయిన యవధాన్యము, కృష్ణ ఇహంగాదులే సుగ్రాహ్యములు.

“యువవరాహధికరణన్యాయేన లోకప్రసిద్ధి:శాస్త్రసిద్ధ్యాబాధ్యా:”

కావుననే అనార్యులచే వ్యహరింపబడు బార్లే, సూకరా
ద్యర్ధములు అధికరణార్ధమున నిరసింపబడినవి. పంకజము
నకు నత్తగుల్లలు గాక పద్మము అను నర్ధమే వ్యవహార
సిద్ధ మైనట్లు.

యవాగూగర్తప్లవనన్యాయము

గంజిగుంట దాఁటె నన్నట్లు.

యుధ్యత్కుక్కుటన్యాయము

పోట్లాడే కోళ్ళు బాదినా వెనుదీయవు.

పోట్లాట ప్రారంభించువఱకును కోళ్ళకు వైర ముండదు.
ఆతరువాతకూడ యజమానులు తెచ్చిపెట్టిన వైరమేకాని
వానికి సకారణముగ కలిగినది కాదు. అట్లయ్యు కోళ్ళు
ఘోరముగ పోరాడును.

మౌర్ఖ్యము నీన్యాయము సూచించును.