పుట:SamskrutaNayamulu.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
83

సంస్కృతన్యాయములు

అపుడు దానిలోఁ గలిసిన మసి ఉన్నట్లే కనఁబడక మినుములలోఁ గలిసిపోవును. అట్టియెడ దానిని విడదీయుట కష్టసాధ్యము కదా!.

"యథా మాషరాశౌ మషీ, యథా వా నీలోత్పలవనే కాదమ్బ స్తద్భేదాగ్రహా త్తదపృథగ్భావేనాభిమన్యతే వ్యవహ్రియతే చ!"

సర్వార్థసిద్ధి.

ముంజాదిషీకోద్ధరణన్యాయము

ముంజగడ్డిలోనుండి తద్గర్భస్థమవు కోమలతృణముఁ జతురతతోఁ దీసినయట్లు.

"యథా ముంజా దిషీకైవ మాత్మా యుక్త్యా సముద్ధృతః! శరీరత్రితయా ద్ధీరైః పరం బ్రహ్మైవ జాయతే!"

ముంజాంతస్థ్సమవు నిషీకము వలె నిపుణతతో శరీరత్రితయమునుండి ధీరులచే సముద్ధరింపఁబడిన ఆత్మ పరబ్రహ్మయై ప్రకాశించును.

మూర్ఖసేవనన్యాయము

మూర్ఖునిఁ గొలిచినట్లు.

ఊషరవృష్టివలె నిష్ప్రయోజనము అని భావము.

మూర్ఖునిఁ గొలిచిన ప్రయోజనము లేకపోవుటయేగాక వానిమూర్ఖతయు సంక్రమించును.

(విధవకు దండము పెట్టిన నావలె నూఱేండ్లు జీవించుమని దీవించినదఁట.)