పుట:SamskrutaNayamulu.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాహితీసమితి సభాపతులు, నవ్యసాహిత్యాచార్యులు సుప్రసిద్ధకవులు నవు శ్రీ తల్లావజ్ఝల శివశంకరశాస్త్రిగారు

శ్రీ కూచిభొట్ల ప్రభాకరశాస్త్రిగారు, వారి సోదరులు శ్రీ ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రిగారు తెలుగులో వివరించిన సంస్కృతన్యాయములు అనే గ్రంథము స్థాలీపులాకన్యాయరీత్యా తిరగవేశాను. వివరణము బాగున్నది. న్యాయమనేది విశేష విషయానికి సూత్రప్రాయమైన పంక్తి. న్యాయాలు షడ్దర్శకాలలోనూ, కావ్యనాటకాది సాహిత్యగ్రంథాలలోనూ తరుచుగా కనబడుతూ ఉంటవి. అవి బాగా గ్రహించడము అవసరము. ఈ పుస్తకము విద్యార్థులకూ, ఉపాధ్యాయులకూ, గ్రంథకర్తలకూ, కవులకూ ఉపకరిస్తుంది.

సాహితీ సమితి, తెనాలు. భాద్రపద బహుళ షష్ఠి (Sd.) తల్లావజ్ఝల శివశంకరశాస్త్రి