పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈమాటలు విని పింగళకుడు "ఆతడు నిజముగా విరోధించినను నా కపాయము జేయగలుగు సామర్థ్య మాతని కేమిగలదు" అని మరల బ్రశ్నింపగా దమనకు డిటులయెను.

"అ ట్లెన్నడు దలపరాదు. క్షుద్రశత్రువు కూడ నొకపు డెంత యపకారమైన జేయగలడు. అతనికి బరంపరగా నెందఱి స్నేహ ముండునో యెవ్వరి కెఱుక? చూడుము. ఒకతీతువు మిత్రవర్గము దోడుగాగా సముద్రమును సాధించెను.

తీతువు సముద్రుని సాధించిన కథ

దక్షిణసముద్రతీరమున నొకపు డొక తీతువు, దాని భార్యయు నొక చెట్టుమీద గూడు కట్టుకొని నివసించు చుండెను. భార్యకు బ్రసవదినములు సమీపింపగా నొకనాడది భర్తతో నిట్లు సంభాషణము సాగించెను.

భార్య - నాథా! ప్రసవమునకు దగినచోటు వెదుకుము,

భర్త - ఇది తగిన స్థలము గాదా?

భార్య - ఇది సముద్రము నానుకొని యున్నది.

భర్త - సముద్రముచే బీడింప బడునంత యసమర్థులమా మనము?

భార్య - మనకును సముద్రునకును భేదము చాలగలదు. యుక్తాయుక్తములు, శక్యాశక్యములు దెలియ పరిజ్ఞానము