పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మణియొద్ద కుఱికెను. అట్లుఱుకుటయే తడవుగా నాతడు బంగరుమేడలతో నిండిన యొకపట్టణమునకు బోయి యందొక సుందరసౌధమున విద్యాధరకన్యలచే సేవింప బడుచున్న యా సుందరాంగిం జూచెను.

ఆమెయు రాకొమరుని దూరమునుండియే చూచి యాతనితో మాటలాడుటకై తనచెలికత్తె నంపెను. చెలికత్తె యాతనికడకు బోయి "రాజకుమారా! మాచెలి కందర్ప కేళియను విద్యాధరచక్రవర్తి కూతురు రత్నమంజిరి. 'ఎవడు తనంతట దానీ సువర్ణనగరముం జూచి చేరవచ్చునో యాతని బెండ్లి యాడవలయు' నని యామెసంకల్పము. కావున నీవామెను గాంధర్వ విధిచే వివాహమాడుము" అని పలికెను.

కందర్ప కేతు 'డట్లే' యని యంగీకరించి రత్నమంజరిని వివాహమాడి యచటనే హాయిగా సమస్తసుఖములు ననుభవించుచుండెను. ఒకనా డామె యాతనితో "స్వామీ! యీసర్వైశ్వర్యము నీయధీనము, నీయిచ్చవచ్చినట్లు దీని ననుభవింప వచ్చును. ఈచిత్రపటమందలి యాకృతిస్వర్ణ రేఖయను విద్యాధరకన్యది. దీనినిమాత్రము నీవెన్నడు దాకవలదు. అట్లు తాకినయెడల మహాప్రమాదము సంభవింప గలదు. అని పలికెను.

కొంతకాల మట్లు కడచిన పిమ్మట నొకనాడు కందర్ప కేతుడు కుతూహలము నిలుపుకొనలేక యా స్వర్ణ రేఖను