పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కరటక దమనకుల విషాదము - పన్నుగడ

అనంతర మీవిషయము లన్నియు గరటక దమనకులకు మిక్కిలి ఖేదము గలిగించెను. దమనకుడు కరటకునితో మిత్రమా! యిపుడు గర్తవ్య మేమి? ఇది స్వయంకృతాపరాధము. స్వయంకృతదోషమునకు విలపించుట కూడ యుక్తముగాదు. తాము చేసికొన్న దోషముచేత నొక రాజకుమారుడు నొకసన్న్యాసియు హాని నొందిరి. నీకా కథలు చెప్పెదను వినుము.

స్వయంకృతాపరాధమువలన జెడిన రాజకుమారుని కథ

సింహళ దేశరాజయిన జీమూతకేతునకు గందర్పకేతు డను నొక కుమారుడు గలడు. ఆత డొకనా డుద్యానవనమున నుండగా నొక యోడబేరగాడు వచ్చి "ప్రభూ! సముద్ర మధ్యమున మొన్నటి చతుర్దశినాడు డొకకల్ప వృక్షము బయలు దేఱినది. ఆవృక్షముక్రింద రత్నకాంతులతో దేదీప్యమానముగా నున్న పానుపుపై సర్వాలంకారములు ధరించి వీణవాయించుచు లక్ష్మివలె నుండు నొక కన్య కానబడినది." అని చెప్పగా రాజకుమారునకు గుతూహలము గలిగి యాతనితో సముద్రతీరమునకు బోయెను.

సరిగా వణిజుడు చెప్పిన చొప్పున నున్న కన్యకా మణింజూచి యామె రూపలావణ్యములచే రాకొమరు డాకర్షింపబడెను. వెంటనే యాతడు మహాసాహసమున నాబాలా