పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లును జిరకాలమునుండి యాశ్రయించి యున్నవారు నగు కరటకదమనకు లెన్నడు గోశాధికారమున నియోగింప దగినవారు గారు. ఉద్యోగప్రసక్తిలో నేను వినియున్న ధర్మములు తెలుపుదును. వినుము.

బ్రాహ్మణుడు క్షత్రియుడు, బంధువు గోశాధికారమున నియోగింపదగరు. బ్రాహ్మణుడు సంపాదింపబడిన ధనము కష్టకాలమున నైన వినియోగింపడు. క్షత్రియు డన్నిటికి ఖడ్గము జూపును. బంధువు జ్ఞాతిభావముచేత సమస్తము నాక్రమించి హరించును. చిరసేవ యొనరించు నియోగి దోషమునకైనను వెఱవక స్వామిని లెక్కగొనక నిరంకుశుడై చరించును. ఉపకారినెన్నడు గోశాధికారమున నియమింపరాదు. తానొనరించిన యుపకారము నిమిత్తముగా జేసికొని నిత్యము రాజసన్నిధానమున జరించుచు దానే రా జన్న ట్లాతడు చరించును. సమృద్ధిగలవానిని మంత్రిగా నియమించిన నసాధ్యుడగును. సమృద్ధి చిత్తవికారము గలిగించును.

పిండినకొలదియు ద్రవించు దుష్టవ్రణమువలె నుద్యోగులు ప్రభుని యంతస్సారము బీల్చివేయుదురు. ఎంతపిండినను దడివస్త్రము పయోధారల నొసగ జాలనట్లెంత యొత్తుడు గలిగినను నుద్యోగులు హరించిన ధనము దెచ్చి యీయరు.