పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గరటక దమనకులే తినివైచుచుండిరా?" యని సంజీవకుడడిగెను. "ఔను ప్రతిదిన మట్లే జరుగుచుండెను" అని పింగళకు డనగా సంజీవకుడు "ఈపని ప్రభువుల యెఱుకలోనే జరుగుచుండెనా?" యని యడిగి "నాకు, దెలిసియు దెలియకయు జరుగుచుండె" నని పింగళకుడు చెప్పగా సంజీవకు డిట్లు విన్నవించెను.

ప్రభూ! ఇది యెంతమాత్రము దగదు. ఆపదకు బ్రతిక్రియ యొనరించుట దక్క మఱేపనియు బ్రభువునకు నివేదింపకుండ భృత్యుడు తనంతదాను స్వతంత్రించి చేయరాదు. కమండలువు తనలోని సారమంతయు ద్యజించి యజమానుని మేలునకై మిక్కిలి జలమును గ్రహించునట్లు మంత్రియైనవాడు ప్రభువునెడల వర్తింపవలయును. కోశము బెంపు సేయువాడే నిజమైన మంత్రి. ఏలయన; రాజునకు గోశమే ప్రాణములు గాని, ప్రాణములు గావు. పురుషున కేయితరగుణములచేతను గోశసమృద్ధివలన వచ్చినంత గౌరవము రాజాలదు. ధనహీను నాలుబిడ్డలే నిరాదరింతు రన నితరుల మాట సెప్పనేల? అతివ్యయము, సపరిశీలనము, సధర్మార్జనము, గోశవ్యసనమునకు లక్షణములు. ఆదాయము గుఱుతింపక స్వేచ్ఛగా వ్యయము చేయువాడు కుబేరతుల్యుడయినను ననతికాలమున జేటు నొందును."

సంజీవకుని పలుకులు విని స్తబ్ధకర్ణు డిట్లు పలికెను. "సోదరా! వినుము. సంధి విగ్రహాది కార్యములందు సమర్థు