పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంజీవకుడు మంత్రియు, గరటక దమనకులు కోశాధికారులు నగుట

సంజీవకుడు విధేయతతో బింగళకునకు సాష్టాంగ వందన మాచరించి "ప్రభుని యాజ్ఞలకు బద్ధుడను" అని పలికెను. పింగళకుడు సంతసించి యావృషభమునకు మంత్రి పద మొసగి గౌరవించెను. నాటినుండియు బింగళక సంజీవకులు కడుంగడు నమ్మకముతో జెలిమి యొనరించుచు సుఖముగా కాలము గడుపుచుండిరి. పింగళకుడు కరటక దమనకులను గోశాధికారులుగా నియమించి గౌరవించెను.

స్తబ్ధకర్ణుని రాక - సంజీవకుడు కోశాధికారి యగుట

అనంతర మొకనాడు పింగళకుని సోదరుడయిన స్తబ్ధకర్ణు డచటికి వచ్చెను. పింగళకు డాతని సగౌరవముగా నాహ్వానించి గౌరవించి యాతని కాహార మొసగుటకై మృగములను జంప స్వయముగా బయలు దేఱుచుండెను. ఆసమయమున సంజీవకుడు "ప్రభూ! చంపబడిన జంతువుల మాంసము నిలువలేదా?" యని యడిగెను.

"కరటక దమనకులకు దెలియవలె" నని సింహము చెప్పెను. "ఉన్నదో లేదో తెలిసికొనుట మంచిది" అని సంజీవకు డనెను. పింగళకుడు వర్తమానించి తెలిసికొని "మాంసము నిలువ లే" దని చెప్పెను. "మాంసమంతయు