పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యన్యుడుగాడు." అనుమాటలకు దమనకుడు నవ్వి యిటులనియెను.

"నఖుడా! నీ కేమియు నాందోళన మవసరము లేదు. భయకారణము దెలిసియేయున్నది. అది వర్థమానుడను వణిజునిచే నడవియందు విడువబడిన యెద్దు వైచిన ఱంకెయే గాని యన్యము గాదు. వృషభములు మనముకూడ సులభముగా భుజింపదగినవి. రాజువిషయమై సందియ మేల?" యను దమనకుని పలుకుల "కట్లైన ముందే స్వామికి దెలిపి యాతని భయము మానుపరాదా?" యని కరటకుడు ప్రశ్నించెను.

దానికి దమనకుడు "వెంటనే భయము మాన్పించిన మనకు జిరకాలగౌరవ మెటులు గలుగును? భృత్యులెన్నడును స్వామి నిక దమ యవసరములేని స్థితికి దేరాదు. ప్రభుని యవసరములన్నియు మిగులకుండ దీర్చువాడు దధి కర్ణునివలె జెడును. నీకా కథ యెఱింగించెదను వినుము.

సింహము పనియంతయు నెఱవేర్చి చెడిన పిల్లి కథ

ఉత్తరదేశమం దర్బుదశిఖర మనెడి యొక పర్వతము గలదు. అందు దుర్దాంతుడను మహాబలముగల సింహము వసించుచుండెను. అది కొండగుహలో సుఖముగా నిదురించు చుండునపు డొక యెలుక రోజును కేసరములు గొఱుకు