పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మేకును బెఱికి మరణించిన కోతి కథ

మగధదేశమునందు శుభదత్తుడను నొక వైశ్యుడు గలడు. చాలకాలము వఱ కాతనికి సంతానము గలుగలేదు. అందువలన నాతడు సప్తసంతానములలోనివి యైన దేవాలయనిర్మాణము, చెఱువులు ద్రవ్వించుట, చెట్లునాటించి వనమహోత్సవము చేయుట మున్నగు పుణ్యకార్యములందు దన ధనము వెచ్చించుచుండెను.

ఒకనా డొకదేవాలయము శిథిలమై యుండుట గాంచి దానిని బాగుచేయించుట కావైశ్యుడు పూనుకొని తగిన శిల్పులను, బనివాండ్రను నేర్పఱచెను. ఒకనాడు వడ్రంగి యొక చేవదూలమును బనివాండ్రచే గోయించుచు నది సులభముగా జీలుటకై యచటనచట గొయ్యమేకులు దిగ గొట్టించెను. అంతలో వేళదాటుటచేత బనివారందఱు దమతమ యిండ్లకు బోయిరి.

ఇంతలో నొక కోతులమంద యచటికి వచ్చి దేవాలయపు గోడలమీదను సమీపమందలి చెట్లమీదను విహరించుచు బెక్కు రకములుగా జేష్టలు చేయుచుండెను. వానిలో నొకకోతి మేకులు దిగ గొట్టియున్న దూలము నొద్దకు వచ్చి దానిపై గూరుచుండి కొయ్యమేకు రెండు చేతుల తోడను గట్టిగా బట్టుకొనియెను. అపుడా కోతి తోక దూలపు నెఱియలో బడి వ్రేలాడుచుండెను. ఆకోతి సహజమగు చప