పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యందును, సోదరునియందును గుమారుని యందును గూడ, గలుగదు.

ఇదియంతయు దైవకల్పితము. పూర్వకర్మవలని ఫలము మంచిదైనను, జెడ్డదైనను ననుభవింపక తప్పదు. శరీరమున కెల్లప్పుడు నపాయము సిద్ధము. సంపద లాపదలకు మూలములు. స్నేహము లనిత్యములు. జనించిన దేదియు నశింపక మానదు.

ద్రవ్యాభిలాషచే సంపద గలిగినపు డందఱును మిత్రులగుదురు. సుఖమునందువలె దు:ఖమునందును బాలుపంచు కొనువా డెవ్వడో వాడే నిజమగు మిత్రుడు. దీనికి విపత్తులే నికషోపములు." ఇట్లు విచారించి చిత్రాంగ లఘుపతనకులతో నిట్లనియెను.

"ఇంక విచారించుచు నూరకుండిన లాభములేదు. బోయవా డీ యడవి దాటకముందే మిత్రుని విడిపింపవలయును. నాకొక యుపాయము తోచుచున్నది. చెప్పెదను. వినుడు. చిత్రాంగుడు కిరాతకుడు పోవుమార్గమున నొక మడుగుచెంత జచ్చినట్లు పడియుండవలయును. కాకి చిత్రాంగునిపై వ్రాలి ముక్కుతో బొడుచుచున్నట్లు నటింపవలయును. ఈ బోయ మృగము చచ్చి పడియున్నదని తలచి తప్పక మంథరు నచట విడిచి మృగమును గ్రహించుటకై ప్రయత్నపడును. నే నపుడు క్షణములో మంథరుని బంధములు