పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దున్నించి విస్తారమయిన పంట పండించి యాధాన్యముల నమ్మివేయుచుందును. కొన్నికోడెలను విక్రయించి మఱికొంత ధనము సంపాదింతును.

ఈప్రకారముగా సంపాదించిన ధనముం జూచి "నీకు గన్యనిచ్చెద" మని యనేకులు వచ్చెదరు. వారిలో గులంబును రూపంబును, గుణమును గలిగిన కన్య నెంచికొని పెండ్లియాడి యామెతో సంసారము చేయగా నొకకుమారుడు పుట్టును. ఆబాలునకు సోమశర్మయని పేరువెట్టుదును. కొన్ని నెలలయిన తరువాత వానికి బంగరు మువ్వలమొలత్రాడు, రావిరేక మురుగులు, గొలుసులు, అందెలు మొదలయిన నగలుపెట్టి యాదరముతో జూచెదను. వా డాడుకొనుచు నల్లరిచేయు సమయమున నేను పనితొందరలోనుండి పిల్లవానిం దీయుమని నాభార్యను బిలిచెదను ఆమెయు నేదోపనిలోనుండుట వలన నాలస్యము గావచ్చును. ఆలస్య మైనందులకు గోపగించి యామె నీకఱ్ఱతో గొట్టెదను" అని యాలోచించుచు బేలపిండి తినుటకు గుక్కలు మొదలగునవిరాకుండ బెదరించుటకు దగ్గఱనుంచుకొన్న కఱ్ఱగిరగిర ద్రిప్పికొట్టెను. ఆదెబ్బతగిలి పేలపిండి యున్నకుండ పగిలిపోయి పిండియంతయు జెదరి మంటిపాలయి పోయెను. దానితో మెలకువవచ్చి, జరిగినది తెలిసికొని యా బ్ర్రహ్మణ కుమారుడు మిక్కిలి విషాదము నొందెను. కాబట్టి యనాగతకార్యముల గుఱించి చింతింప