పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యావింటి చేరువకు బోయి నారి గొఱుకగనే బెట్టువదలి వింటికొన గాటముగ ఱొమ్మున దగిలి ప్రాణములు దీసెను.

అతిలోభ మెంత హానికరమో చూడుము. దానమునకు భోగమునకు వినియోగపడినది మాత్రమే స్వధనము. అట్లుపయోగింపక కూడ బెట్టినది యితరులపా లగును. గతించిన దానికి విచారమేల? పండితులు రానిదానికై ప్రాకులాడరు; పోయినదానికి విచారింపరు. ఆపదవచ్చినను గలత నొందరు. కావున నీవెప్పుడు నుత్సాహము గోలుపోవకుము. శాస్త్రములెన్ని చదివినను గ్రియాశూన్యుని బండితు డనుట చెల్లదు. ఔషధమెంతమంచి మందైనను బేరుచెప్పినంతమాత్రాన రోగులకు సుఖమొసగదు గదా! ఉత్సాహములేనివానికి బాండిత్యము గ్రుడ్డివానికి దనచేతియందలి దివ్వియవలె నిరుపయోగము. కావున నోరిమి వహింపుము. పరస్థలమునకు వచ్చితినని చింతింపకుము.

రాజు, కులస్త్రీ, మంత్రులు, దంతములు, కేశములు, నఖములు, నరులు స్థానభ్రష్టులైన శోభింప రను వాక్యము కాపురుషుల విషయమున మాత్రమే వర్తించును. సింహములు, సత్పురుషులు, గజములు, సర్వదేశములందు సంచరించి కీర్తినొందుట లేదా? మఱియు గాకములు, మృగములు, కాపురుషులు స్థానమునుండి కదలజాలక యచటనే నశింతురు. అభిమానధనుడగు వీరునకు దనదేశమనియు, బరదేశమనియు భేదములేదు. ఎచటికేగిన నచటనే తనసామ