పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వైచెను. నాటినుండి యుత్సాహ మంతయు బోయి యాహారమైనను సంపాదించుకొను శక్తిలేనివాడనై దిగులుపడి మెల్లమెల్లగా దిరుగుచుంటిని.

చూడాకర్ణు డట్టియవస్థలో నొకనాడు నన్ను జూచి తన మిత్రునితో నిట్లనెను. "లోకమున ధనము గలవాడే బలవంతుడు. పండితుడు నాతడే. గ్రీష్మకాలమున నదు లింకిపోయినట్లు ధనములేనివాడు చేయదలపెట్టు కార్యములన్నియు జెడిపోవును. ధనముగలవారికే బంధువులు, మిత్రులు నిలిచియుండుదురు. బిడ్డలులేని యిల్లును, చుట్టములులేని దేశము, మూర్ఖుని మనస్సు శూన్యముగా నుండును. దారిద్రునకు సర్వము శూన్యముగ నుండును. దారిద్ర్యముకంటె జావు మేలు. మరణము తత్కాలమున మాత్రమే బాధ గలిగించును. దారిద్ర్యము బ్రదికియున్నంతకాలము బాధించు చుండును. అన్నిలక్షణములును వెనుకటివలెనే యున్నను ధనము తొలగినంతనే వేఱుమనుజునివలె నయిపోవును. ఈ సంగతి యెంతయు జిత్రమయినది. ధనము:గోలుపోయి యీ యెలుక యెంత నిరుత్సాహ మొందినదియో చూడుము."

అది విని నేనిట్లాలోచించితిని. "ఇంక నే నిచట నుండుట దగదు. ఈ వృత్తాంత మెవ్వరికి జెప్పను దగదు. "ధననాశము, మనోవ్యథ, యింటిగుట్టు, మోసము, పరాభవము నెవ్వరికి జెప్పరాని" వని పెద్ద లందురు. దైవము మిక్కిలి ప్రతికూలమై పౌరుషము చెడిపోయినపు డభిమానము