పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అపు డామె భర్తతో "నువ్వులు, బియ్యము గొంచెము కూడబెట్టి యుంచితిని. ఱేపు తిలాన్నము జేయుదును లెండు" అని చెప్పి నువ్వులు బాగుగా గడిగి యెండ బోసెను. ఒక కోడివచ్చి యానువ్వులు కాళ్ళతో జిమ్మెను. బ్రాహ్మణు డది చూచి బ్రాహ్మణ భోజనమున కీనువ్వులు పనికిరావు. కాబట్టి యవి తీసికొనిపోయి మార్చి తీసికొనిరమ్మని భార్యకు జెప్పెను. తరువాత నామె నేను భిక్ష కేగిన యింటికి వచ్చి "నువ్వు పప్పు దీసికొని నువ్వు లిచ్చెదరా?" యని యా యింటివారి నడిగెను. ఆ యింటి యిల్లా లామాటలు విని సంతసించి యింటిలోనుండి నువ్వులు తీసికొని వచ్చి నువ్వుపప్పు పుచ్చుకొనుచున్న సయమున నాయింటి బ్రాహ్మణు డెచటి నుండియో యింటికివచ్చెను. "భార్యను జూచి నీవేమి బేరమాడుచున్నావని ప్రశ్నించెను. ఆమె చెప్పిన సంగతి విని "వెఱ్ఱిదానా? చేరుడు నువ్వులు దీసికొని దంచిననువ్వు లిచ్చువా రెక్కడనైన నుందురా? ఈమె యిట్లు వచ్చుట కేదో కారణ ముండితీరును." అని యాబ్రాహ్మణుడు చెప్పుచుండగా భిక్షార్థ మచటనున్న నే నామాటలు విని యుంటిని. ఈ మూషికమును దగిన కారణము లేనిదే యిచట నింతధైర్యముగా గాపురముండదు."

ఇట్లు వీణాకర్ణుడు చెప్పిన కథ విని వెంటనే చూడాకర్ణు డొక గునపము దెచ్చి నేను నివసించు కలుగును ద్రవ్వి చిరకాలమునుండి సంపాదించిన నా ధనమునంతను దీసి