పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధరించినదై నను సర్పము చేర రాని దైనట్లుగా నెట్టివిద్యగలవాడైనను దుర్జనుడు చేరనీయక విడువదగినవాడు. నేలమీద వానలును నీటిమీద బండ్లును నడువజాలని విధమున శత్రువు మేలొనరించుట యసంభవము. శత్రువును, దనపై మనసులేని భార్యను నమ్మియుండువాని క చిరకాలము ననే హాని సంభవింపకమానదు" అని దృఢముగా బలికెను.

ఆ మాటలు విని లఘుపతనకము "వేయిమాటలేల? నీవు నాచెలిమి కంగీకరింపని యెడల నేటినుండి నిరశనవ్రతము బూని ప్రాణములు కోలుపోవుదును. కారణ మేమన; మంటి కుండనువలె దుర్జనుని ద్వరలో విడగొట్టుట సులభము. సంధించుట మిక్కిలి కష్టము. బంగరుకలశము త్వరితముగా సంధింపబడును గాని తేలికగా విడగొట్టబడదు. సుజనుని విధము నట్టిదియే.

సుజనులను జూచినంతమాత్రమున సఖ్య మేర్పడును. అది విడదీయరానిదై యుండును. సుజనులు నారి కేళమువలె సారము గలిగియున్నట్లు బయటికి గన బడకున్నను నంతరంగమున సుగుణసారము గలిగి యుందురు. దుర్జనులు మేడిపండువలె బయటికి మాత్రము సుందరముగా గనబడుదురు. సాధువుల చెలిమి కేకారణమున నైన నాటంకములు గలిగినను వారి గుణముల యోగ్యత సెడదు. తామరతూండ్లు త్రుంచి వేయబడినను వాని దారములు విడిపోవు. మంచిమిత్రుని గుణములని చెప్పబడు దయ, స్నేహము, త్యాగము,