పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చచ్చినదని తలచి వల వదలించెను. అది చూచి కాకి కూసెను. అంతట వేగముగా లేచి లేడి పాఱిపోయెను. మృగముచేసిన వంచన కా పొలముకాపు మిక్కిలికోపించి తన చేతనున్న బడియ విసరగా నది గుఱితప్పి దాగియున్న నక్కకు దగిలెను. దానిచేత నానక్క వెంటనే ప్రాణములు విడిచెను.

"పుణ్యముగాని, పాపముగాని మితిమీఱి చేయువారికి ఫలితము కొలది కాలములోనే సంభవించును." అనిన విని లఘుపతనకము హిరణ్యకున కిట్లనెను.

"నిన్ను జంపిన మాత్రమున నాకు బుష్కలముగ నాహారము చేకూఱునా? నీతో మైత్రి యొనరించి చిత్రగ్రీవుని వలె నుండుదును. నీవెన్ని చెప్పినను నీ చెలిమి సేయనిదే జీవించి యుండజాలను. నే నింతగా మాట్లాడితినని నాపై గోపగింపకుము. సాధువులకు గోపము వచ్చినను వా రితరులకు హానిచేయ బూనుకొనరు, నిప్పురవ్వ తగిలిన మాత్రమున సముద్రజలము వేడి యెక్కదు."

ఈ మాట విని, "నీవు చంచలబుద్దివి. చపలుని చెలిమి మంచిదిగాదు. మార్జాలము, దున్నపోతు, కాకము, దుర్జనుడు నమ్మించి యెంతపనియైన జేయగలరు. మఱియు నీవు మాకు శత్రువుల తెగకు జెందినవాడవు. శత్రు వెంతమంచివాడైనను వానితో జెలిమి సేయదగదు. జల మెంత యుష్ణమైనదైనను నిప్పును జల్లార్పకుండునా? మంచి మాణిక్యములను