పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

13

నేమఱక కాపాడుకొనవలయును.' అని నీతివిదులు పలుకుదురు ప్రాణములు ధర్మార్థకామమోక్షముల సుస్థితికి మూలములు. అవిపోయినచో సర్వము బోయినట్లే." అని చెప్పెను.

ఆపలుకులు విని చిత్రగ్రీవుడు మరల నిట్లనెను. "మిత్రుడా! నీవు చెప్పినది నీతియే. అయినను నా యాశ్రితుల దుఃఖము నేను సహింపజాలను; కావున నిట్లు పలికితిని. 'పరుల నిమిత్తము ధనమునే కాక జీవితమును గూడ వదలుకొనవలయు ' నని పెద్దలు చెప్పుదురు. ఎప్పుడైనను నశింపక తప్పని ప్రాణములు మంచికారణమున ద్యజించుట శ్రేయస్కరముగదా! అన్నివిధముల వీరు నాకు సమానులు. వీరినిపుడు రక్షింపలేకున్నచో వీరికి నాప్రభుత్వమువలని యుపయోగమేమి? జీతబత్తెములు లేకున్నను వీరెల్లపుడు వీడక నను గొలుచుచున్నారు. నాజీవితము వదలుకొని యైనను వీరిని రక్షించుట మేలు. అనిత్యము, మలినము నగు దేహముచే శాశ్వతము, నిర్మలము నగు యశము లభించు నపుడిక గావలసినదేమె యుండును? శరీరము క్షణకాలములో నశించునది; గుణములు కల్పాంతమువఱకు నుండునవి. కావున మలినమైన నాదేహము విషయమున శ్రద్ధమాని నాకీర్తిశరీరమును గాపాడుము.'

చిత్రగ్రీవు డాడిన యీమాటలు విని హిరణ్యకుడు సంతోషముచేత బులకితుడయి యిట్లనియెను. "సఖుడా మేలుమేలు" ఆశ్రితుల యెడల వాత్సల్యమనెడి నీ యీ సుగు