పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12

నా కానందము గలిగించినాడు." అని పలికి వలలో దగులుకొన్న పావురములను జూచి కొంచెము భయపడి "మిత్రుడా! ఇదియేమె" యని యడిగెను.

దానికి జిత్రగ్రీవుడు "మిత్రుడా! యిది మా పూర్వజన్మకర్మమునకు ఫలము, రోగము, పరితాపము, బంధనము, వ్యసనము నను నవి ప్రాణుల కాత్మాపరాధవృక్షఫలములు గదా!" యని బదులు పలికెను.

వెంటనే హిరణ్యకుడు చిత్రగ్రీవుని బంధనములు గొఱుకుటకై సిద్ధపడెను. చిత్రగ్రీవుడు "మిత్రమా! ఇదిసరికాదు. ముందు నాయాశ్రితుల బంధములు తెగ గొఱుకుము. తరువాత నావియు గొఱుకవచ్చును."అనెను.

ఇది విని యా మూషికరాజు "నాదంతములు కడుసున్నితములు. శక్తియు దక్కువగా నున్నది. కావున ముందుగా నీ బంధములు చేదించి తరువాత శక్తియున్నచో వారి బంధముల సంగతి చూచెదా ననెను.

ఆ పలుకులకు జిత్రగ్రీవుడు "సరే; శక్తికి మించి యేమి చేయగలవు? ముందు వీరి బంధములు శక్తియున్నంతవఱకు ద్రుంపుము. పిమ్మటనే నాపని చూడవచ్చును" అన,మూషికరాజు "తన్నువీడి యితరుల గాపాడ దలచుట నీతి గాదు. 'ఆపదవేళ నుపయోగపడుటకై ధనమును రక్షించుకొనవలయును. ధనమును, దారను వీడియైనను తన్ను దా