పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అవి కనుచూపుమేర దాటిపోగా నాతడు నిరాశుడై మరలి తనతావునకు బోయెను.

ఆత డట్లు మరలిపోవుట చూచి "మన కిపుడు కర్తవ్యమేమి?" యని యాపక్షు లడుగగా జిత్రగ్రీవు డిటు లనియెను.

"లోకమున దల్లియు, దండ్రియు, మిత్రుడు నను నీ మువ్వురే నిజమైన హితులు. కడమవా రందఱు దమమేలు కోరిమాత్రమే హితు లగుచున్నారు. నాకు మూషిక రాజగు హిరణ్యకు డను నొక మిత్రుడు గలడు. గండకీ నదీతీరమున జిత్రవనమం దాతడు నివసించుచుండును. ఆతడీ వల గొఱికి మనలను విడిపింపగలడు" అని చెప్పగనే పావురములన్నియు బోయి హిరణ్యకుడు వాసము చేయుచున్న కలుగుదరిని వ్రాలెను.

హిరణ్యకుడు పావురములకు మేలుసేయుట

హిరణ్యకుడు పావురములు వ్రాలిన సవ్వడి గుర్తించి భయముచే దన కలుగులో గదలక మెదలక యుండెను. అపుడు చిత్రగ్రీవుడు "చెలికాడా! మాతో మాటాడవేల?" యని యెలుగెత్తి పిలిచెను. ఆమాట చిత్రగ్రీవునిదని గుర్తించి వెంటనే హిరణ్యకుడు కలుగు వెలుపలికి వచ్చెను. చిత్రగ్రీవుని జూచి "మిత్రునితో సంభాషణము, సహనివాసము, కలుగుట కన్న పుణ్యము మఱిలేదు. పుణ్యవశమున నాచెలికాడువచ్చి