పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దించుకొని జీవించుటయే కష్టమగును. అసూయగలవాడు, నిందగలవాడు, సంతోషము లేనివాడు, కోపస్వభావుడు, పరులపోషణపై నాధారపడువాడు, నెల్లపుడు సందేహముతో గూడియుండువాడు నను నీ యాఱుగురు దుఃఖభాగులని పెద్దల వచనము" ఈ మాటలు విని పావురములన్నియు నచట వ్రాలి బోయవాడు పన్నిన వలలో దగులుకొనెను.

"లోభము కడు దుష్టగుణము కదా! అన్నివిషయములు దెలిసియుండియు, బరుల సంశయములు దీర్ప నేర్పరు లయ్యు లోభమునకు లొంగి మిగుల గష్టపడుదురు. లోభమె సమస్తదోషములకు మూలము. బంగరులేడి జనించుట యసంభవమయినను శ్రీరామునంతటివాడు లోభపడి హానిజెందెను. ఆపద రానై యున్న కాలమున నెంతటివారి బుద్ధియు మలిన మగును."

వలలో జిక్కిన పావురము లన్నియు సంశయము పనికిరాదని తమ కాలోచనము చెప్పిన పావురమును నిందింప దొడగినవి.

"గుంపునకు ముందు మార్గదర్శకుడుగా నుండరాదు. కార్యము సఫల మయినయెడల ఫలిత మందఱకు సమానమే. కార్యము చెడిపోయినచో నిందమాత్రము మార్గదర్శకునకు వచ్చును."

పావురములు నిందించుట చూచి చిత్రగ్రీవుడు వానితో నిట్లనెను. "ఆపద రానైయున్నపుడు మేలు కూడ గీడుగా