పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దాని కా పులి యిట్లు బదులు పలికెను. "నీ వన్నట్లు యౌవనమున నే నతిదుర్మార్గుడనై యుంటిని. అనేకములగు గోవులను, మనుజులను జంపితిని. ఆపాపముచేతనే యాలుబిడ్డలను గోలుపోయి వంశహీనుడనై యుంటిని. పిమ్మట నొక పుణ్యాత్ముడు "గోవులను, మనుజులను చంపుట మానివైచి దానధర్మములు చేయుము" అని నాకు బోధించెను. నాటి నుండియు స్నానదానాదులు చేయుచుంటిని.

గోళ్లు, దంతములులేని ముదుసలిని. నే నెవరి కేమి యపకారము చేయగలను? ధర్మమార్గమునకు లోభము లేకుండుట మొదటి సోపానము. చేతజిక్కిన కంకణమును దాన మిచ్చుచున్న నాకు లోభము లేదనుసంగతి తెల్లమే కదా!

అయినప్పటికి బులులు మనుజుల జంపునని లోక ప్రసిద్ధి. దాని నెవరు వారింపగలరు? గ్రుడ్డినమ్మకమే కాని ధర్మమును గనిపెట్టుట లోకమున నఱుదు. మరుస్థలమున గురియు వానవలెను, నాకలిగొన్నవాని కిడు భోజనమువలెను, పేదలకొసగు దానము ప్రశస్తము. నీవు దరిద్రుడవనియు, సర్వవిధముల బాత్రుడవనియు దీనిని నీకీయ దలచితిని. రోగముగలవాని కౌషధ మీయవలయునుగాని యారోగ్య వంతున కిచ్చిన నేమి యుపయోగము? కావున నీ చెఱువులో స్నానముచేసి వచ్చి దీనిని గ్రహింపుము. సంశయింపకుము."

ఇట్లు పలికిన పులిమాటలకు లోబడి యాబాటసారి స్నానమునకై చెఱువున దిగబోయి పెనుఱొంపిలో దిగబడి