పుట:SakalathatvaDharpanamu.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
18. సిరోస్థితాష్ట దిక్పాలకుల పట్టణములు.

భ్రూమధ్యమున దేవేంద్రుని పట్టణము, కుడినేత్రమందు అగ్నిదేవుని పట్టణము, కుడిచెవియందు యమధర్మరాజు పట్టణము, కుడిచెవియొక్క పార్శ్వమున నైరుతి పట్టణము, పశ్చిమభాగంబున వరుణుని పట్టణము, దానికి సమీపమున వాయుదేవుని పట్టణము, యడమచెవియందు కుబేరుని పట్టణము, యడమనేత్రమందు యీశాను డైన యీశ్వరుని పట్టణము ఈ8న్ని సిరోస్థితాష్టదిక్పాలకుల పట్టణములు.

19. మాయాశక్తాష్టవిధము.

పృథివితన్మాత్ర గంధగుణము, ఉదకతన్మాత్ర రసగుణము, అగ్నితన్మాత్ర రూపగుణము, వాయుతన్మాత్ర స్పర్శగుణము, గగనతన్మాత్ర శబ్దగుణము, మనస్సు, బుద్ధి, అహంకారము ఈ8న్ని మాయాశక్తాష్టవిధ మనబడును.

20. శోకకారణాష్టకము.

ప్రాణము, అపానము, ఉదానము, వ్యానము. సమానము,