పుట:SakalathatvaDharpanamu.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
14. ప్రాణాష్టవిధలక్షణము.

తత్వసంఖ్య, శ్వాససంధి, స్వరచిహ్నము, షానములు, తత్వవర్ణనములు, ప్రణవము, స్వరసంయుక్తము, గతిలక్షణము యీ8న్ని ప్రాణాష్టవిధము లనంబడును.

15. అష్టవిధదేవసర్గములు.

విబుధులు, పిత్రుదేవతలు, సురాదులు, గంధర్వాప్సరసలు, యక్షరక్షస్సులు, భూతప్రేతపిశాచంబులు, సిద్ధచారణవిద్యాధరులు, కిన్నరకింపురుషులు యీ8న్ని అష్టవిధదేవసర్గము లనంబడును.

16. అష్టావధానములు.

చతురంగము, కవిత్వము, వ్రాయుట, చదువుట, గణితము, సంగీతము, యుక్తిజెప్పుట, వాగనిపుణము ఈ8న్ని అష్టావధానము లనంబడును.

17. అష్టదళపద్మములు.