పుట:SakalathatvaDharpanamu.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
12. మరియొకవిధ సత్పధాతువులు.

చర్మము, రక్తము, మాంసము, మేదస్సు, శల్యములు, మజ్జ, శుక్లము యీ7న్ను సప్తధాతువులని కొంద రందురు.

13. మరియొకవిధ సప్తవ్యసనములు.

వేటాడుట, జూదమాడుట, సురాపానముజేయుట, స్త్రీలోలుడగుట, కఠినవాక్యంబు బలుకుట, కఠినదండంబు జేయుట, కానియీవియిచ్చుట యీ7న్ను సప్తవ్యసనము లనంబడును.

14. సప్తమండలములు.

భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు యీ7న్ను సప్తమండలము లనబడును.

15. సప్తసంతానములు.

సత్కుమారుని గాంచుట, తటాకము వేయించుట, కావ్యంబు రచించుట, కోటికి పడిగెత్తుట, గుడి కట్టించుట, వనము వేయించుట, సద్బ్రాహ్మణులకు జీవనాధారంబులు గల్పించుట ఈ7న్ను సప్తసంతతు లనంబడును.

యీసప్తసంతతులతో నేదైననోకటిం జేసినవాడు తన నూటొక్క కులమువారిని నరక విముక్తులంజేసి స్వర్గంబునకు నడుపుట నిక్కమయినను కావ్యం బిన్నిటికి భూషణంబయినను వీరలకు స్వర్గాది భోగ ప్రాప్తియేకాని శాశ్వత ముఖంబయిన మోక్షంబు గలుగ నేరదని వేదాంతశాస్త్రసిద్ధాంతము.