Jump to content

పుట:SakalathatvaDharpanamu.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

22. షడభీజ్నత్వము.

దివ్యద్రుష్టి, దివ్యశ్రోత్రము, పూర్వనివాస్థానుస్మృతి, పరచిత్తజ్నానము, అప్రత్యక్షవిషయజ్నానము, వియద్గమనాగమనవియోగాది లక్షణమైన బుద్ధి యీ6న్ను షడభిజ్నత్వ మనబడును.

సప్తసంఖ్యా ప్రకరణము

1. సప్తధాతువులు.

రసము, రుధిరము, మాంసము, మేదస్సు, మజ్జ, శుక్లము, అస్తి యీ7న్ను సప్తధాతువు లనంబడును.

ప్రాణాయామాదియోగాభ్యాసమువలన ఈషధభిజిత్వముగలుగు నని తెలియుటే యీవిచారమునకు 
2. సప్తవ్యసనములు.

తనువ్యసనము, మనోవ్యసనము, ద్రవ్యవ్యసనము, రాజ్యవ్యసనము, విశ్వాసవ్యసనము, వుత్సాహన్యసనము, కలహవ్యసనము యీ7న్ను సప్తవ్యసనము లనంబడును.

3. సప్తావస్తలు.

అజ్నానము, ఆవరణము, విక్షేపము, పరోక్షము, అవరోక్షము, అనర్ధనివృత్తి, ఆనందావాప్తి యీన్ను సప్తావస్త లనంబడును. అగ్నానము--భానుడయిన ఆత్మ సంసారమందాసక్తి గల