Jump to content

పుట:SakalathatvaDharpanamu.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

73

17. అరిష్డ్వర్గజననవినాశహేతువులు.

18. షణ్మతములు.

వైష్ణవము, శైవము, శాక్తము, గాణాపత్యము, సౌరము, కాపాలము ఈ6న్ను షణ్మతము లనంబడును. ఈ షణ్మతములచేత ఆత్మ దెలియబడదని తెలియుటే ఫలము. ఈ షణ్మతములకు తాత్పర్యము బహుళంబై యుండుటచే గ్రంథవిస్తారభీతిని నిందు దెలుపలేదు.

19. షట్కర్మలు.

యజనము, యాజనము, అధ్యయనము, అధ్యాపనము, దాసము, ప్రతిగ్రహము యీ 6 న్ను షట్కర్మము లనంబడును. ఈ షట్కర్మముల వలన మోక్షము లేదని తెలియుటే ఫలము.

20. షట్‌శాస్త్రములు.

తర్కము, వ్యాకరణము, ధర్మశాస్త్రము, మీమాంసము, వైద్యశాస్త్రము, జ్యోతిషము యీ6న్ను షట్‌శాస్త్రము లనంబడును.

21. షడ్రసములు.

మధురము, ఆమ్లము, లవణము, తిక్తము, కటు, కషాయము యీ6న్ను షడ్రసము లనంబడును. ఈ రసములను ఆత్మ సాన్నిధ్యమందుండు బుద్ధిరసేంద్రియ ద్వారా విభజించి యెరుగుచున్నదని తెలియుటే యీ విచారమునకు ఫలము.