ఈ పుటను అచ్చుదిద్దలేదు
9. షడూర్ములు.
క్షుద, తృష్ణ, శోకము, మోహము, జననము, మరణము యీ 6న్ను షడూర్ము లనంబడును.
10. షడ్భావవికారములు.
జాయతే, అస్తితే, పరిణమతె, వర్ధతె, వివక్షయతె, వినస్యతె యీ6న్ను షడ్భావవికారము లనంబడు.
11. అరిషడ్వర్గములు.
కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము యీ6న్ను అరిషడ్వర్గము లనబడును.
12. షడ్విధ జితేంద్రియములు.
అజిహ్వుడు, షండుడు, పంగుడు, అంధుడు, బధిరుడు, ముగ్ధుడు యీ6న్ను షడ్విధజితేంద్రియు డనబడుదురు.