ఈ పుటను అచ్చుదిద్దలేదు
60
38. పంచయజ్నములు.
పాఠము, హోమము, సపర్య, తర్పణము, బలి యీ 5 న్ను పంచయజ్నము లనంబడును.
39. ప్రమోదితజనన్యాదిపంచకము.
జనని, జనకుడు, సద్గురు, అగ్నిహోత్రుడు, ఆత్ముడు యీ ఐదుగురినిన్ని ప్రమోదింపజేసి వారల ప్రసాదంబు వడయుట మేలని తాత్పర్యము.
40. ఏకోత్తరపంచభూతగుణములు.
ఆకాశమునకు శబ్దము, వాయువునకు శబ్దస్పర్శలు, అగ్నికి శబ్దస్పర్శ రూపములు, జలముకు శబ్దరూపరసములు, పృథివికి శబ్దస్పర్శరూప రసగంధములు గుణములని తెలియవలయు.
41. పంచభూతలయకాలనిర్ణయము.