ఈ పుట అచ్చుదిద్దబడ్డది
58
30. వివేకపంచకము.
ద్రుగ్ద్రుశ్యవివేకము, పంచకోశవివేకము, పంచభూతవివేకము, నామరూపవివేకము, తత్వవివేకము యీ5న్ను వివేకపంచక మనబడును.
31. కర్మకారణపంచకము.
దేహము, అహంకారము, శ్రోత్రాదికరణములు, ప్రాణాపానాది వ్యాపారములు, సూర్యాద్యధీ దైవములు యీ5న్ను కర్మకారణములు.
32. పంచమహాపాతకములు.
స్వర్ణస్తేయము, సురాపానము, బ్రహ్మహత్య, గురుపత్నీగమనము యీనలువురి యొక్క సహవాసము యీ5న్ను పంచమహాపాతకము లనంబడును. ఇవి ప్రాణాంతకాలమం దైనను జేయగూడ దని పండితులు వచింతురు.
33. పంచకమలములు.
ఆధారకమలము, యొనికమలము, నాభికమలము, హృదయకమలము, ముఖకమలము యీ5న్ను పంచకమలము లనబడును.