ఈ పుటను అచ్చుదిద్దలేదు
54
21. పంచావస్థలు.
జాగ్రదావస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యావస్థ, తూర్యావస్థ, సహజావస్థ యీ5న్ను పంచావస్థ లనంబడును.
యీ అవస్థలు ఆత్మకు లేవనుటయే యీ విచారమునకు ఫలము.
22. పంచావస్తల స్థానములు.
జాగ్రదావస్తకు భ్రూమధ్యస్థానము, స్వప్నావస్తకు కంఠస్థానము, సుషుప్త్యావస్తకు హృదయస్థానము, తూర్యావస్తకు నాభిస్థానము, సహజావస్తకు గుహ్యస్థానము యీ5న్ను పంచావస్తల స్థానము లనంబడును.
23. పంచభ్రమలు.
భేదభ్రమ, కర్తృత్వభ్రమ, సంగితభ్రమ, కారిత్వభ్రమ, సత్యత్వభ్రమ యీ5న్ను పంచభ్రమ లనబడును.