పుట:SakalathatvaDharpanamu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

49

26. చతుర్విధదైవోపాసకులక్రమము.

ద్విజాతులు, మునులు, అల్పబుద్ధులు, విదితాత్ములు యీ 4 న్ను చతుర్విధదైవోపాసకు లనంబడుదురు.


పంచసంఖ్యా ప్రకరణము

1. పంచభూతములు.

పృథివి, జలము, అగ్ని, వాయు, ఆకాశము యీ 5 న్ను పంచభూతము లనబడును.

2. పంచభూతస్థానములు.

పృథివికి గుదస్థానము, జలముకు లింగస్థానము, అగ్నికి నాభిస్థానము, వాయువునకు హృదయస్థానము, ఆకాశమునకు కంఠస్థానము.

3. పంచభూతరూపములు.

పృథివి పీతవర్ణము, జలము శ్వేతవర్ణము, అగ్ని రక్తవర్ణము, వాయువు కృష్ణవర్ణము, ఆకాశము నీలవర్ణము.

4. పంచభూతబీజములు.

పృథివికి లం బీజము, జలమును వం బీజము, అగ్నికి రం బీజము, వాయువుకు యం బీజము, ఆకాశమునకు హం బీజము.