Jump to content

పుట:SakalathatvaDharpanamu.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

48

20. సద్గుణచతుష్టయము.

మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష యీ4న్ను సద్గుణచతుష్టయములు.

మైత్రి అనగా, సాధుసాంగత్యంబు జేయుచుండుట.

కరుణ యనగా, దుఃఖితాత్ములయందు పరితపించుట.

ముదిత యనగా, పుణ్యకారులయందు సంతోషించుట.

ఉపేక్ష యనగా, పాపాత్ములయందు రాగద్వేషములు లేకయుండుట.

21. చతురాశ్రమధర్మంబులు.

బ్రహ్మచారి, గృహస్తు, వానప్రస్తు, సన్యాసి యీ4న్ను చతురాశ్రమవాసులనంబడుదురు.