Jump to content

పుట:SakalathatvaDharpanamu.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

205

తేచాన్యకర్మాణియస్మిన్ ద్రుష్టేపరావరేః అను శ్రుతిప్రమాణము ననుసరించి హృదయగ్రంధియైన లింగశరీరము నశించగానే సకల సంశయములు నివారణమై బ్రహ్మసందర్శనమై 'బ్రహ్మవేదబ్రహ్మైభవతీ బ్రహ్మను తెలిసినవాడు బ్రహ్మే అగునను శ్రుతిప్రమాణము చొప్పున బ్రహ్మలో ఐక్యమగుచున్నాడు. ఇట్లని విచారించి శరీరత్రయవిలక్షణుం డైన ప్రత్యగాత్మ తానని తెలిసికొనినవాడు కుక్తుండని వేదాంతసిద్ధాంతము.

గద్య.

ఇది శ్రీమన్నారాయణ సచ్చిదానంద పరిపూర్ణ పరబ్రహ్మ వర ప్రసాదలబ్ధ కవితా విలాస సందడి నాగదాస ప్రణీతంబైన సకలతత్వార్థదర్పనము సంపూర్ణము.

ఏతత్సర్వంబును శ్రీలక్ష్మీనారాయణార్పణమస్తు.

కరకృతమపరాధం క్షంతుమర్హంతు సంతః.

[[దస్త్రం:|366px|page=213]]

చెన్నపురి: బరూరు, త్యాగరాయశాస్త్రులు అండ్ సన్ వారి స్వకీయ గీర్వాణభాషారత్నాకరముద్రాక్షరశాలయందు ముద్రితము--1925