Jump to content

పుట:SakalathatvaDharpanamu.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

202

32. ఏకోత్తర శతగుణాధికానంగ నిర్ణయము.

తనయొక్క ఆనందమనెడి ప్రళయకాలసముద్రమందు సార్వభౌముడైన చక్రవర్తియొక్కయు, మనుష్యలోకమందు శ్రేష్ఠుడైన మనుష్యగంధర్వునియొక్కయు, దేవగంధర్వునియొక్కయు, ద్వివిధము లైన పితృదేవతలయొక్కయు, అనగా అజాత జానదేవతలయొక్కయు, అగ్నిష్వాత్తాది దేవతలయొక్కయు, కర్మదేవతలయొక్కయు, దేవతలయొక్కయు, ఇంద్రునియొక్కయు, బృహస్పతియొక్కయు, చతుర్ముఖునియొక్కయు, విరాట్పురుషుడయిన తటస్థేశ్వరునియొక్కయు, హిరణ్యగర్భునియొక్కయు, 12 ఆనందములు, నురుగులు, నీటిచినుకులు, నీటిబుగ్గలు, అలలు మొదలయిన భేదములుగాను పుట్టుచు వృద్ధిబొందుచు అణగుచుండును.