పుట:SakalathatvaDharpanamu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రథమనిరుక్తము-ప్ర.3

3

తానువోడినను దు:ఖమేననిన్ని విచారించినట్టయితె శాస్త్రవాసనబోవును. (అని వాసుదేవమననము)

2. ఈషణత్రయము.

దారీషణ, ధనీషణ, పుత్రీషణ యీ 3 న్ను యీషణత్రయమన బడును.

దారీషణ:- కామధర్మాదిసకలసుఖములు, భార్య గలిగినం గలుగునని, భార్యయం దాసక్తి గలిగియుండుట దారీషణ యనబడును. -దీనికి నివృత్తి. తాను దరిద్రుడైయుండినను, లేక దీర్ఘవ్యాధులచేత తపింపుచుండినను, యెల్లప్పుడు భార్య తనను దూషింపుచుండునని విచారించినట్టయితె దారీషణ బోవును.

ధనీషణ:- ధనము గలిగియుండిన యజ్ఞ దానాదిసత్కర్మములు జేసి స్వర్గాదిసుఖము లనుభవింపవచ్చునని ధనముగోరుచుండుట ధనీషణయనంబడు. -దీనికి నివృత్తి, ధనము సంపాదించుటయందు దు:ఖమనిన్ని, దాని సంరక్షణయున్ను దు:ఖమనిన్ని, కర్మవశముచే నాధనము పోయిన మిగుల దు:ఖం బనిన్ని, స్వర్గాదిభోగములు గలిగినను పునర్జన్మకారణమనిన్ని విచారించినట్టయితే ధనీషణ బోవు.

పుత్రీషణ:- పుత్రులు లేనిది నరకవిముక్తిన్ని, స్వర్గాదిభోగములున్ను, యిహమందు ప్రతిష్ఠయున్ను లేదని పుత్రులు గావలెనని గోరుచుండుట పుత్రీషణ యనబడును.-దీనికి నివృత్తి, పుత్రులు గలుగక మునుపు తపో దాన తీర్థయాత్రాది క్లేశములున్ను, దైవవశంబుమం గలిగి వినయవివేకంబులు లేక మూడుండైయున్న అపకీర్త్యాది దు:ఖంబులును, కాల వశంబున మృతించిన సకల దు:ఖములును కుమారుడు గలుగ జేయు నని విచారించినట్టయితె పుత్రీషణ బోవును. (అని వాసుదేవమననము)

3. మలత్రయము.

యణవమలము, మాయామలము, కార్మికమలము యీ 3 న్ను మలత్రయ మనంబడు.

యణవమలము:- పరమాత్మకు దెలియలేక సంసారియై నేను జీవుడను, అజ్ఞానుడను అని తలంచుచుండుట యణవమల మనబడును.

మాయామలము:- పరులకు మనోవాక్కాయములచేత అపకారంబు జేయుచు పరులు నేనును భిన్నభావంబు గలిగియుండుట మాయామల మనబడును.