పుట:SakalathatvaDharpanamu.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
9. దశావతారములు.

మచ్చావతారము, కూర్మావతారము, వరాహావతారము, నారసింహావతారము, వామనావతారము, పరశురామావతారము, శ్రీరామావతారము, బలరామావతారము, బుద్ధావతారము, కలికావతారము యీ10న్ని దశావతారము లనంబడు.

10. జ్నానదశాచిహ్నములు.

అక్రోధము, ఆరోగ్యము, జితేంద్రియత్వము, దయ, క్షమ, జనప్రియత్వము, అలోభత్వము, ధాత్రుత్వము, అభయము, నైర్మల్యత్వము యీ10న్ని జ్నానదశాచిహ్మము లనంబడు.

ఫలము స్పష్టము.

11. దశబలములు.

బుద్ధి, క్షాంతి, వీర్యము, ధ్యానము, జ్నానము, కృప, శీలము, బలము, దానము, ఉపేక్ష యీ10న్ని దశబలము లనంబడు.

ఫలార్థములు స్పష్టము.

12. భాగవతదశలక్షణము.

సర్గము, విసర్గము, స్థానము, పోషణము, ఊతులు, మన్వంతరము, ఈశానుచరిత్రము, నిరోధము, ముక్తి, ఆశ్రయము యీ10న్ని భాగవతదశలక్షణము లనంబడును.