2
సకలతత్వార్థదర్పణము
అట్టినేను,
గ్రంథోత్పత్తి దేశకాలనిర్ణయము
సీ. శ్రీకరంబగు మర్త్యలోకంబునందున భరతఖండమున సిరులదనరు
బందరు విషయంబునందు నందిగ్రామ సీమలో మిక్కిలి చెలగుచున్న
జగ్గయ్యపేట కీశాన్యమం దున్న దబ్బాకుపల్లెను వురవరమునందు
వెలయు మరుత్పుత్రు వినుతించి శాలివాహనశకమున మతంగాంతరిక్ష
హస్తిశశిసంఖ్యనడువతటస్థమైన పార్థివాబ్దంబునందు సంభ్రమముతోడ
సకలతత్వార్థదర్పణసౌఙనొప్పు శాస్త్ర్రమును జెప్పబూనితి శౌరికృపను.
త్రిసంఖ్యాప్రకరణము
లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన యీ 3 న్ను వాసనాత్రయ మనబడు.
లోకవాసన - లోకముతోపాటుగా సంచరించవలయుననియును, లోకులందరు తన్నుస్తోత్రము సేయవలయుననియును మనస్సుయం దుండి ప్రవర్తించుట లోకవాసన యనంబడు, - దీనికి నివృత్తి. ఈశ్వరునకు కూడా నింద లేకుండా జరగకపోయినది, గనుక, అజ్నానులు నిందించిన స్తోత్రమువేసిన ఆ స్తుతినిందలు శరీరమునకేకాని, ఆత్మకు లేవని విచారించినట్టయితె లోకవాసన బోవును.
దేహవాసన - సమస్తతీర్థములయందు స్నానము చేసిన పవిత్రుడననియును, ప్రాణాయామాది యోగంబులు చేసిన కాయసిద్ధిగలదనియును మనస్సుయందుండి వర్తించుట దేహవాసన యనంబడు. - దీనికి నివృత్తి. రక్తమాంసపూరితము శరీర మనిన్ని, మిగుల నిర్మలుడు జీవు డనిన్ని, శరీరము మాయాసంబంధమనిన్ని, అనిత్యమనిన్ని విచారించినట్టయితే దేహవాసన బోవును.
శాస్త్రవాసన - శాస్త్రపద్ధతిని కర్మచేయడము, శాస్త్రములు సాకల్యముగా చదువవలెనని మనస్సుయం దుండి ప్రవర్తించుట శాస్త్రవాసన యనంబడును. - దీనికి నివృత్తి. కర్మము అజ్నానమును వృద్ధిజేయుననిన్ని, వెనుక జదివిన దానికి మరువగలదనిన్ని, చదివి పరుల వంచించినను